టీమిండియా ఆసియా కప్ టైటిల్ గెలిచినా.. స్టార్ బౌలర్ షమీని పక్కన పెట్టి చాలా పెద్ద తప్పు చేసింది. సీనియర్ బౌలర్ గా షమీ అనుభవాన్ని వాడుకోకుండా బెంచ్ మీద కూర్చోపెట్టి మరొకరికి స్థానం కల్పించింది. దీంతో ఆసియా కప్ లో ఒక మ్యాచ్ మినహా షమీకి అవకాశం దక్కలేదు. ప్రస్తుతం జరుగుతున్న మొహాలీ వన్డేలో సిరాజ్ కి రెస్ట్ ఇవ్వడంతో తుది జట్టులో స్థానం దక్కించుకున్న షమీ.. ఆస్ట్రేలియా బ్యాటర్ల భరతం పట్టాడు. 5 వికెట్లు తీసి కంగారూల నడ్డి విరిచాడు.
తొలి ఓవర్ నుంచే షమీ దండయాత్ర
టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ జట్టుకి తొలి ఓవర్లోనే షమీ షాకిచ్చాడు. అద్భుతమైన అవుట్ స్వింగ్ బంతితో మిచెల్ మార్ష్ ని అవుట్ చేసాడు. ఇక ఆ తర్వాత క్రీజ్ లో నిలదొక్కుకుంటున్న స్మిత్ ని బౌల్డ్ చేసి కీలక వికెట్ సంపాదించాడు. ఇక చివర్లో స్టయినిస్,అబాట్, షార్ట్ వికెట్లు తీసి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. షమీ 5 వికెట్లలో మూడు క్లీన్ బౌల్డ్ లు ఉండడం విశేషం.
ఆసీస్ డీసెంట్ స్కోర్
ఇక ఈ మ్యాచులో షమీ దెబ్బకి ఆస్ట్రేలియా 276 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్ లో వార్నర్ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్మిత్ 41,లబుషేన్ 39,గ్రీన్ 31,ఇంగ్లీసు 45, స్టోయినిస్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీకి 5, జడేజా,బుమ్రా, అశ్విన్ కి తలో వికెట్ లభించింది. మరో రెండు వికెట్లు రనౌట్ రూపంలో వచ్చాయి.
5 Wickets from Muhammad Shami?#KeralaBoycottLEO #RaghavChadha #PragyanRover #JawanTsunami #JawanBlockBuster Naseem Shah#TejRan #SunnyLeone Faizabad #BabarAzam? #RameshBidhuri #INDvsAUS #DanishAli #AvivePartner #ParineetiChopra #ShilpaShetty#SunnyLeone Canada #Islamophobia pic.twitter.com/NFCdbBsaBk
— Muhammad Shakeel (@shaquile_shak) September 22, 2023