
న్యూఢిల్లీ: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ముగిసిన వెంటనే అతను ఆసీస్‌కు బయలుదేరి వెళ్తాడని సమాచారం. ఎన్‌సీఏ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చిన వెంటనే షమీ ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. ఈ నెల 14 నుంచి 18 వరకు (బ్రిస్బేన్) మూడో టెస్టు, 26 నుంచి 30 (మెల్‌బోర్న్) వరకు నాలుగో టెస్టు జరుగుతాయి. ముస్తాక్ అలీ నాకౌట్ రౌండ్స్ మ్యాచ్‌లు బెంగళూరులో జరగనున్నాయి. దీంతో ఎన్‌సీఏ మెడికల్ టీమ్ డాక్టర్లు నితిన్ పటేల్, నిశాంత్ బోర్డోలోయ్ షమీ ఫిట్‌నెస్‌ను అంచనా వేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వనున్నారు.