శంషాబాద్ ఎయిర్ పోర్టులో ..951 గ్రాముల బంగారం సీజ్

శంషాబాద్, వెలుగు :  అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్యాసింజర్ నుంచి 486 గ్రాముల గోల్డ్​ పౌడర్​ను, మరో ప్యాసింజర్ నుంచి 465 గ్రాముల గోల్డ్​ పేస్ట్​ను స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ: వైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యే vs బీఆర్ఎస్ అభ్యర్థి

వీరిద్దరూ ఎలక్ట్రిక్ సామగ్రిలో బంగారాన్ని దాచి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ మొత్తం 951 గ్రాముల బంగారం విలువ సుమారు రూ.56 లక్షలు ఉంటుందన్నారు.  ప్యాసింజర్లపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.