ఎయిర్ పోర్టులో ఫారిన్ కరెన్సీ పట్టివేత

శంషాబాద్, వెలుగు : ఫారిన్ కరెన్సీని అక్రమంగా తరలించేందుకు యత్నించిన ప్యాసింజర్​ను శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సిటీకి చెందిన ఓ వ్యక్తి ఖతార్ రాజధాని దోహ వెళ్లేందుకు సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అతడి లగేజీని చెక్​ చేయగా రూ.11 లక్షల 44 వేల విలువైన రియాల్స్ దొరికాయి. అతడిపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు  తెలిపారు.