- ఎయిర్‌పోర్టులో రూ.2 కోట్ల బంగారం సీజ్
- మహిళా ప్యాసింజర్ అరెస్ట్
శంషాబాద్, వెలుగు : ప్రైవేటు పార్ట్స్‌లో బంగారాన్ని దాచి తీసుకొచ్చిన మహిళా ప్యాసింజర్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుడాన్‌కు చెందిన నలుగురు మహిళలు బుధవారం ఎమిరేట్స్ ఫ్లైట్‌లో దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరిలో ఓ మహిళ తన ప్రైవేటు పార్ట్స్ లోపల బంగారం పేస్ట్‌ను దాచి తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు స్కానింగ్‌లో గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 3 కిలోల 175 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ సుమారు కోటి 94 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. మహిళపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.