శంషాబాద్ ఎయిర్ పోర్టులో వరుసగా బంగారం పట్టుబడుతుంది. అధికారులు ఎంత నిఘా పెట్టినా నిందితులు ప్రతిసారి కొత్త కొత్త రూపంలో బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తూ.. అడ్డంగా బుక్కవుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాజాగా గురువారం(సెస్టెంబర్ 14) కౌలాలంపూర్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఓ ప్రయాణికుడు ఫ్యాన్ బేరింగ్ లో బంగారాన్ని అమర్చి తరలిస్తుండగా ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు.
Also Read : మామ తెచ్చిన చిచ్చు : దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్.. తిట్టిపోస్తున్న టీడీపీ సోషల్ మీడియా
తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు 636 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 38.62 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
మరో విమానంలో రియాద్ అనే ప్రయాణికుడి నుంచి582 గ్రాముల 5 బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 35 లక్షలు వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇద్దరు ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.