శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో రూ. 33 లక్షల బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న అరకిలో బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి 552 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని ప్రయాణికుడు ప్యాంట్ జేబులో దాచినట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.33.53 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. అతడిపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.