
అమ్రాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హల్ చల్ చేసిన చిరుతను శనివారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఫారెస్ట్ ఆఫీసర్లు విడిచిపెట్టినట్లు మన్ననూర్ ఎఫ్ఆర్వో ఈశ్వర్ తెలిపారు. ఎయిర్ పోర్ట్ వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మేకను ఎరవేసి బంధించారు. అనంతరం నెహ్రూ జూపార్క్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, అర్ధరాత్రి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో వదిలేశారు. చిరుత ఆరోగ్యంగా ఉందని, ట్రాప్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.