బస్సులో రాజస్థాన్ టూ హైదరాబాద్కు... స్వీట్ బాక్సులో రూ. 7 కోట్ల డ్రగ్స్

బస్సులో రాజస్థాన్ టూ హైదరాబాద్కు... స్వీట్ బాక్సులో   రూ. 7 కోట్ల  డ్రగ్స్

హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది.  శంషాబాద్ ఎస్ఓటీ,  మాదాపూర్ పోలీసులు  నార్కోటిక్ బ్యూరో సహాయంతో  నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ లో  హెరాయిన్ ముఠాను పట్టుకున్నారు. శిల్పారామం సమీపంలో  నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  వారి నుంచి కిలో హెరాయిన్, 4 స్మార్ట్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.  పట్టుబడ్డ హెరాయిన్ డ్రగ్స్ విలువ 7 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు.  కిలో హెరాయిన్ నాలుగు ప్యాకెట్లలో ఒక్కొక్కటి 250 గ్రాములు చొప్పున  ప్యాక్ చేసి తీసుకువచ్చారు.  నలుగురు నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారని తెలిపారు.  

 డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ అవినాష్ మహంతి మీడియాకు వెల్లడించారు.  రాజస్థాన్ నాగౌర్ జిల్లాకు చెందిన సంతోష్ ఆచారి  ప్రస్తుతం జోధ్‌పూర్ జైలులో ఉన్నాడు.  జైలుకు వెళ్తూ తనతో ఉన్న డ్రగ్స్  సంతోష్ ఆచారి , నేమి చందుకు ఇచ్చాడు.  అలా తనతో  డ్రగ్స్ను  ఇతరులకు విక్రయించాలని భావించాడు.   నేమి చంద్ రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని  తన సోదరుడు అజయ్ భాటి  దగ్గరక  వచ్చాడు.  అజయ్ భాటి అబ్దుల్లా పూర్ మేట్ లో నివాసం ఉంటున్నాడు.  హైదరాబాద్ లో  డ్రగ్స్ విక్రయించడానికి అజయ్ భాటి ప్లాన్ చేశారు.  ప్లాన్ ప్రకారం నేమీ చంద్, నర్పత్ సింగ్ ఒక కేజీ హెరాయిన్ నాలుగు ప్యాకెట్లు తీసుకుని వచ్చారు. రాజస్థాన్ నుంచి వస్తూ డ్రగ్స్ ను  బస్సులో తీసుకు వచ్చాడు. నిందితులు స్వీట్స్ మాటున  హెరాయిన్ డ్రగ్స్ తీసుకువచ్చారు. అజయ్ భాటితో పాటు చౌటుప్పల్ కు చెందిన  హరీష్ సిర్విని కలిసి హైదరాబాద్‌లో డ్రగ్ విక్రయిద్దం అని ప్లాన్ చేసి తీసుకువచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిందితులను పట్టుకున్నారని తెలిపారు సీపీ మహంతి. 

భోద్ పూర్ జైలులో  ఉన్న సంతోష్ ఆచారి అనే వ్యక్తిని పిటీ వారెంట్ పై తీసుకు వచ్చి   విచారిస్తామని సీపీ మహంతి తెలిపారు..  నిందితులు హైదరాబాదులో ఎవరికి డ్రగ్స్ విక్రయించాలని చూస్తున్నారో అన్నది కస్టడీలోకి తీసుకుని విచారిస్తాం.  దేశ సరిహద్దుల ద్వారా డ్రగ్ ఫెడ్లర్లు డ్రగ్స్ ను దిగుమతి చేసుకుంటున్నారు.  పట్టుబడ్డ నర్పత్ సింగ్ పై రాజస్థాన్ లో NDPS కేసులు ఉన్నాయి.  పట్టుబడ్డ నిందితుల నేర చరిత్ర పై విచారణ చేస్తాం. డ్రగ్స్, గంజాయి సరఫరాదారులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే   పోలీసులకు తెలియజేయాలని కోరారు  సీపీ అవినాశ్ మహంతి.