శంషాబాద్ రెయిన్ బో టవర్స్ యజమానుల రౌడీయిజం..? లీజుకు తీసుకుని చివరికి బిల్డింగే మాదంటున్నారు

శంషాబాద్ రెయిన్ బో టవర్స్ యజమానుల రౌడీయిజం..?  లీజుకు తీసుకుని చివరికి బిల్డింగే మాదంటున్నారు

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలో.. మంచి డిమాండు ఉన్న ఏరియా. దేశ విదేశాల నుంచి టూరిస్టులు, ప్రయాణికులు వచ్చిపోతుంటారు. ఫుల్ బిజినెస్. ఇవన్నీ ఊహించి ఆ ఏరియాలో అద్దెకు తీసుకున్న హోటల్ తమదేనని కబ్జా చేసే ప్లాన్ చేశారు ఆ హోటల్ యజమానులు. అద్దె ఇచ్చే ప్రసక్తే లేదు.. బిల్డింగే మాదని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడు బిల్డింగ్ యజమాని సీవీబి చారీ. 

వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ లో రెయిన్ బో టవర్స్ హెూటల్ యజమానులు రౌడీయిజానికి, దౌర్జన్యానికి పాల్పడటం పోలీసుల దృష్టికి వచ్చింది.  అద్దెకు తీసుకుని హోటల్ నడుపుతూ బిల్డింగ్ కబ్జా చేసే ప్లాన్ చేశారు నిర్వాహకులు  బాసిత్, షోహెబ్.  అద్దె పేరుతో తమ భవనాన్ని లీజుకు తీసుకున్న హోటల్ యజమానులు.. అద్దె అడిగితే భవనం తమదని అంటున్నారని లాడ్జి యజమాని,  బాధితుడు  సీవీబి చారీ శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులను ఆశ్రయించాడు.  బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగం లోకి దిగిన పోలీసులు రెయిన్ బో టవర్స్ హెూటల్ నిర్వాకులు బాసిత్, షోహెబ్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

 హైదరాబాద్ జామై ఉస్మానియా ప్రాంతం లలితా నగర్ ప్రాంతానికి చెందిన సీవీబీ చారీ గతంలో ఎల్బీసీ సంస్థలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించి రిటైర్మెంట్ తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ దగ్గర హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకొని రెయిన్ బో హెూటల్స్ యజమానులైన అన్వర్, బాసిత్ కు సుమారు 435 గజాల స్థలంలో హోటల్ భవనం ఉండేది. అయితే ఈ హెూటల్ భవనం పై అన్వర్, బాసిత్ కుటుంబ సభ్యులు బ్యాంకులో రుణం బాకీ ఉండడంతో బ్యాంకు అధికారులు హెూటల్ భవనాన్ని వేలం ద్వారా విక్రయించారు. ఎల్బీసి రిటైర్డ్ ఉద్యోగి సీవీబి చారీ మరికొందరితో కలిసి అన్వర్, బాసిత్ నుండి 2019 ఆగస్టు 22వ తేదీన భవనాన్ని కొనుగోలు చేశారు.  సీవీబీ చారి తో పాటు సి అరుణ, సివి వెంకటేష్, సివి నవీన్ కుమార్, పి సరిత కలిసి జాయింట్ వెంచర్ గా కొనుగోలు చేశారు. 

ఆ తర్వాత హోటల్ ను నడుపుకుంటామని లీజుకు తీసుకున్నారు అన్వర్, బాసిత్.  హోటల్ నడుపుకుంటూ అద్దె కూడా చెల్లిస్తూ వస్తున్నారు. కానీ కొంతకాలంగా అద్దె ఇవ్వకపోగా బిల్డింగ్ తమదేనని బెదిరింపులకు పాల్పడుతున్నారు. విసిగిపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు  సీఐ బాలరాజు వెల్లడించారు.