- ఐపీఎల్ మ్యాచ్‌పై ఆన్లైన్ బెట్టింగ్
- ఏడుగురు అరెస్ట్..
- రూ. లక్షా 12 వేల క్యాష్ సీజ్
షాద్‌నగర్, వెలుగు : ఐపీఎల్ మ్యాచ్‌లపై ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఏడుగురిని శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్‌నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన సురేశ్ స్థానిక యువకులతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లపై ఆన్లైన్ బెట్టింగ్‌ను మొదలుపెట్టాడు. సురేశ్ శనివారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌పై ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహించాడు.
పరిగి రోడ్‌లోని ఓ టీ స్టాల్ వద్ద ఈ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుసుకున్న శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సురేశ్‌తో పాటు ఫరూఖ్‌నగర్‌కు చెందిన షబ్బీర్, అయ్యప్ప కాలనీకి చెందిన యాదగిరి, ఇంద్రానగర్‌కు చెందిన గణేశ్, జంగయ్య, రమేశ్, కిశోర్ సహా మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. లక్షా 12 వేల 950 క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను షాద్‌నగర్ పోలీసులకు అప్పగించారు.