
శంషాబాద్, వెలుగు:రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ ఆఫీసులో పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు జల్పల్లి నరేందర్ ఆధ్వర్యంలో గురువారం 150 మందికి పైగా వైఎస్సార్టీపీ నేతలు కాంగ్రెస్లో చేరారు. జల్ పల్లి నరేందర్తో పాటు మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్ సంజయ్ యాదవ్.. నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం గడ్డం శేఖర్ యాదవ్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీపై రోజురోజుకు జనాల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. కొత్త చేరికలతో పార్టీ మరింత బలోపేతమవుతు న్నదని.. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్లు బొబ్బిలి శేఖర్, జహంగీర్ పాషా, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ యాదవ్, మండల వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వర్ గౌడ్, మహేందర్ ముదిరాజ్, గోవర్ధన్, నాయకులు పాల్గొన్నారు.