హైదరాబాద్లో భారీ సైబర్స్కాం..రూ.175కోట్లు కాజేశారు

హైదరాబాద్ సైబర్ నేరాగాళ్ల అడ్డాగా మారింది.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఇటీవల కాలంలో చాలా సైబర్ నేరాలు నమోదు అయ్యాయి. పోలీసులు ఎంత నిఘా ఉంచినప్పటికీ సైబర్ ఫ్రాడ్స్టర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీలోని పాతబస్తీలో భారీ సైబర్ స్కామ్ బయటపడింది.. బ్యాంకును బురిడీ కొట్టించి ఏకంగా  రూ. 175 కోట్లు కొల్లగొట్టారు సైబర్ కేటుగాళ్లు.. వివరాల్లోకి వెళితే.. 

పాతబస్తీలో బ్యాంకు నుంచి రూ.175 కోట్లు లావాదేవీలు..సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఇద్దరు ఆటో డ్రైవర్లు..జాతీయ బ్యాంక్‌లో 6 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన ఆ టో డ్రైవర్లు..ఆటో డ్రైవర్ల ద్వారా రూ. 175 కోట్ల లావాదేవీలు జరిపిన సైబర్ కేటుగాళ్లు..హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌, ఇండోనేషియా, కంబోడియాలకు నిధులు బది లీ.. క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు ట్రాన్స్‌ఫర్ చేసిన ఆటో డ్రైవర్లు.

హైదరాబాద్‌ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్ జరిగింది. షంషీర్ గంజ్ SBI బ్యాంకును  టార్గెట్ చేశారు కేటుగాళ్లు.. నకిలీ బ్యాంకు అకౌంట్లతో 175 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది.  6 నకిలీ అకౌంట్లను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. 

కేవలం రెండు నెలల్లో 6 అకైంట్ల ద్వారా రూ. 175 కోట్ల కొల్లగొట్టారు  సైబర్ నేరగాళ్లు. స్థానికంగా ఉండే ఆటో డ్రైవర్లు  అహ్మద్ షాహిద్, బిన్ అహ్మద్ లు ఈ సైబర్ నేర గాళ్లకు సహకరించినట్లు గుర్తించారు. నిందితులిద్దని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  దీనిపై నిందితులను ప్రశ్నించిన పోలీసులు.. మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.