Jasprit Bumrah: అలా జరిగితే బుమ్రా కెరీర్ ముగుస్తుంది.. న్యూజిలాండ్ మాజీ పేసర్ వార్నింగ్

Jasprit Bumrah: అలా జరిగితే బుమ్రా కెరీర్ ముగుస్తుంది.. న్యూజిలాండ్ మాజీ పేసర్ వార్నింగ్

ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో స్టార్ బౌలర్ల లిస్టులో బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు. మూడు ఫార్మాట్ లలో నిలకడగా రాణించే అతి కొద్ది మంది బౌలర్లలో బుమ్రా ఒకడు. తన పదునైన యార్కర్లు, స్వింగ్, బౌన్స్ తో ఎంతటి స్టార్ బ్యాటర్ నైనా బోల్తా కొట్టిస్తాడు. ప్రపంచ స్టార్ బ్యాటర్లు సైతం ఈ యార్కర్ల వీరుడిని ఎదుర్కొనడానికి ఇబ్బంది పడతారు. ఇప్పటికే క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన బుమ్రా..నెంబర్ వన్ బౌలర్ గా కితాబులందుకుంటున్నాడు. ఎంతో భవిష్యత్ ఉన్న బుమ్రాకు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ హెచ్చరించాడు. అతని గాయంపై కీలక కామెంట్స్ చేశాడు.    

Also Read :- ప్రపంచం మొత్తం జట్టుగా వచ్చినా ఇండియాను ఓడించలేదు

షేన్ బాండ్ మాట్లాడుతూ.. " రానున్న ప్రపంచ కప్ కు బుమ్రా అత్యంత కీలకం. అతను జట్టులో ఉండడం చాలా ముఖ్యం. బుమ్రాను ఇంగ్లాండ్ తో ఐదు టెస్టులు ఆడించాలని చూస్తున్నారు. నేనైతే అతన్ని రెండు టెస్టులకంటే ఎక్కువ ఆడించాలనుకోవట్లేదు. అతను ఫిట్ గా ఉంటే అన్ని మ్యాచ్ లు ఆడించాలనుకోవడం కరెక్ట్ కాదు. అతను ఇండియాకు బెస్ట్ బౌలర్. అన్ని ఫార్మాట్ లలో అతన్ని ఆడించి రెస్ట్ లేకుండా చేస్తే అతని కెరీర్ దెబ్బ తింటుంది. బుమ్రాకు మరోసారి వెన్ను గాయంతో అదే స్థానంలో సర్జరీ చేయించుకుంటే అతని క్రికెట్ కెరీర్ ముగిసే అవకాశం ఉంది". అని ఈ కివీస్ మాజీ పేసర్ తెలిపాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cric Crak (@criccrak_)

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన ఈ టీమిండియా పేసర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని సమాచారం. బుమ్రా క్రికెట్‌లోకి తిరిగి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చని అర్ధమవుతుంది. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. ముంబై ఇండియన్స్ ఆడబోయే తొలి మూడు లేదా నాలుగు మ్యాచ్ లకు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. నడుము గాయం కారణంగా ప్రస్తుతం క్రికెట్ కు దూరంగా ఉంటున్న బుమ్రా ఏప్రిల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నట్టు బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం.

జూన్ నెలలో ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐపీఎల్ తర్వాత రెండు వారాల్లో ఇంగ్లాండ్ కు భారత్ పయనం కావాల్సి ఉంది. టెస్ట్ ఛాంపియన్స్ షిప్ లో కీలకంగా మారిన ఈ సిరీస్ లో బుమ్రా ఆడడం చాలా కీలకం. ఈ సుదీర్ఘ సిరీస్ కు బుమ్రా తాజాగా ఉండాలంటే అతనికి మరింత రెస్ట్ బీసీసీఐ భావిస్తోందట. బుమ్రా 2025 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు రూ.18 కోట్ల రూపాయలతో ఈ టీమిండియా పేసర్ ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది. బుమ్రా లేకపోవడం ముంబైకి అతి పెద్ద మైనస్ కానుంది.