మూడు రోజుల్లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్ క్రికెటర్ గుడ్ బై

మూడు రోజుల్లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్ క్రికెటర్ గుడ్ బై

వెస్టిండీస్​ వికెట్‌ కీపర్‌/ బ్యాటర్‌ షేన్‌ డౌరిచ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తక్షణమే ఈ రిటైర్మెంట్‌ అమల్లోకి వస్తుందని ప్రకటన చేశాడు. అయితే అతను తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో విండీస్ క్రికెట్​ బోర్డు అయోమయంలో పడింది. ఎందుకంటే డిసెంబర్​ 3 నుంచి ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్- ఇంగ్లాండ్​ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అందుకు ఎంపిక చేసిన విండీస్  వన్డే జట్టులో డౌరిచ్ సభ్యుడు. 

32 ఏళ్ల షేన్‌ డౌరిచ్ 2015లో వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 35 టెస్ట్‌లు ఆడిన ఈ వికెట్‌ కీపర్‌.. 1570 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 9 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక విండీస్ తరుపున ఒకే ఒక వన్డే ఆడగా.. అందులో 6 పరుగులు చేశాడు. బ్యాటర్‍గా ఇతడు జట్టులో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ.. కీపర్‌గా ప్రత్యర్థి జట్లను భయపెడుతుంటాడు. 

వెస్టిండీస్ వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, షేన్‌ డౌరిచ్‌(వికెట్ కీపర్), యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, షిమ్రాన్ హెట్మెయర్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోటీ, క్జోర్న్ ఓట్లీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్ థామస్.

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ షెడ్యూల్

  • మొదటి వన్డే (డిసెంబర్ 03): సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం (ఆంటిగ్వా)
  • రెండో వన్డే (డిసెంబర్ 06): సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం (ఆంటిగ్వా)
  • మూడో వన్డే (డిసెంబర్ 09): కెన్సింగ్టన్ ఓవల్ (బార్బడోస్)
  • మొదటి టీ20 (డిసెంబర్ 12):  కెన్సింగ్టన్ ఓవల్ (బార్బడోస్)
  • రెండో టీ20 (డిసెంబర్ 14): నేషనల్ క్రికెట్ స్టేడియం (గ్రెనడా)
  • మూడో టీ20 (డిసెంబర్ 16): నేషనల్ క్రికెట్ స్టేడియం (గ్రెనడా)
  • నాలుగో టీ20 (డిసెంబర్ 19): బ్రియాన్ లారా స్టేడియం (ట్రినిడాడ్)
  • ఐదో టీ20 (డిసెంబర్ 21): బ్రియాన్ లారా స్టేడియం (ట్రినిడాడ్)