షేన్ వార్న్ కెరీర్ హైలైట్స్: ఐపీఎల్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ టైటిల్‌‌‌‌ అతనిదే..!

  • షేన్ వార్న్ హఠాన్మరణం 
  • హార్ట్‌‌‌‌ ఎటాక్‌‌తో  కన్నుమూత
  • సంతాపం ప్రకటించిన  వరల్డ్‌‌ క్రికెట్‌‌

మెల్‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్: తన స్పిన్‌‌‌‌ మాయాజాలంతో వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ను శాసించిన ఆస్ట్రేలియా లెజెండ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ షేన్‌‌‌‌ వార్న్‌‌‌‌ (52) గుండెపోటుతో శుక్రవారం కన్ను మూశాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌లో ప్రముఖ టూరిస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ అయిన కో సముయ్‌‌‌‌లోని ఓ విల్లా గదిలో అచేతనంగా పడి ఉన్న వార్న్‌‌‌‌ను చూసిన సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో.. వార్న్‌‌‌‌ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన కృషి ఫలించలేదు. క్వీన్స్‌‌‌‌లాండ్‌‌‌‌లో మృతి చెందిన లెజెండ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ రాడ్‌‌‌‌ మార్ష్‌‌‌‌ (74)కు సంతాపం తెలిపిన కొన్ని గంటలకే వార్న్‌‌‌‌ మరణించడం క్రికెట్‌‌‌‌ ప్రపంచాన్ని షాక్‌‌‌‌కు గురి చేసింది. 
 

బాల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ సెంచరీతో..
1992లో అరంగేట్రం చేసిన వార్న్‌‌‌‌.. 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌‌‌‌కు సేవలందించాడు. 1993లో 24 ఏళ్ల వయసులో వార్న్‌‌‌‌ తన స్పిన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో ఓ అద్భుతాన్ని సృష్టించాడు.  ఓల్డ్‌‌‌‌ ట్రాఫోర్డ్‌‌‌‌లో జరిగిన మ్యాచ్‌‌‌‌లో మైక్‌‌‌‌ గాటింగ్‌‌‌‌కు వేసిన లెగ్‌‌‌‌ సైడ్‌‌‌‌ బాల్‌‌‌‌... ఊహించని రీతిలో టర్న్‌‌‌‌ అయ్యి ఆఫ్‌‌‌‌ స్టంప్‌‌‌‌ బేయిల్స్‌‌‌‌ను ఎగురగొట్టింది. వార్న్‌‌‌‌.. బాల్‌‌‌‌ను టర్న్‌‌‌‌ చేసిన విధానం ఇప్పటికీ పెద్ద రహస్యమే. క్రికెట్‌‌‌‌ హిస్టరీలో ఈ సంఘటనను ‘బాల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ సెంచరీ’గా పిలుస్తారు. ఆసీస్‌‌‌‌ తరఫున 145 టెస్ట్‌‌‌‌లు ఆడిన వార్న్‌‌‌‌ 708 వికెట్లు తీశాడు. టెస్ట్‌‌‌‌ల్లో 37సార్లు ఐదు వికెట్ల హాల్‌‌‌‌, 10 సార్లు పది వికెట్ల హాల్‌‌‌‌ను సాధించాడు. ఇక 194 వన్డేల్లో 293 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్‌‌‌‌లో ఎన్నో రికార్డులు సాధించిన వార్న్‌‌‌‌ 2007లో క్రికెట్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పాడు. 2013లో ఐసీసీ ‘హాల్‌‌‌‌ ఫేమ్‌‌‌‌’లో చోటు కల్పించింది.  
 

విజ్డెన్‌‌‌‌ ఐదుగురిలో ఒకడు..
వార్న్‌‌‌‌ తన ఘనతలతో ‘విజ్డెన్‌‌‌‌ ఫైవ్‌‌‌‌ క్రికెటర్స్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద సెంచరీ’లో ఒకడిగా గుర్తింపు పొందాడు. 1999లో ఆస్ట్రేలియా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ గెలవడంలో వార్న్​ కీలక పాత్ర పోషించాడు. లెజెండ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ సచిన్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌కు బౌలింగ్‌‌‌‌ చేయాలంటే భయపడే వార్న్‌‌‌‌.. టెస్ట్‌‌‌‌ల్లో అతని వికెట్‌‌‌‌ కోసం చాలా ప్రయోగాలు చేశాడు. ఇండియాతో సిరీస్‌‌‌‌ అంటే అటు మాటలతోనూ కవ్వించే ఆసీస్‌‌‌‌ ప్లేయర్లకు భిన్నంగా వార్న్‌‌‌‌ ఆటతో ప్రత్యర్థులను భయపెట్టేవాడు. ఇండియాలో రవిశాస్త్రిని ఔట్‌‌‌‌ చేసి ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌ను ఖాతాలో వేసుకున్న వార్న్‌‌‌‌.. ఆఫ్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌లోనూ చాలా ఆడంబరంగా జీవించేవాడు. వార్న్‌‌‌‌ తన వ్యక్తిత్వం, ప్రవర్తనతో వరల్డ్‌‌‌‌ వైడ్‌‌‌‌గా ఫ్యాన్స్‌‌‌‌ను సంపాదించుకున్నాడు. దీనివల్ల కొన్ని వివాదాల్లోనూ ఇరుక్కున్నాడు. 1998లో మార్క్‌‌‌‌వాతో కలిసి బుకీలకు పిచ్‌‌‌‌, వెదర్‌‌‌‌ కండీషన్‌‌‌‌ సమాచారం ఇచ్చినందుకు క్రికెట్‌‌‌‌ ఆస్ట్రేలియా భారీగా ఫైన్‌‌‌‌ విధించింది. 2003 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌కు ముందు డోప్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో పట్టుబడిన వార్న్‌‌‌‌ టోర్నీ నుంచి సస్పెండ్‌‌‌‌ అయ్యాడు. పరీక్షల్లో అతను నిషేధిత డై యూరెటిక్‌‌‌‌ ఉత్ప్రేరకాలను వాడినట్లు తేలింది. 
 

ఐపీఎల్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ టైటిల్‌‌‌‌ అతనిదే..
ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పిన తర్వాత వార్న్‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌లో డబుల్‌‌‌‌ రోల్‌‌‌‌ పోషించాడు. మెగా లీగ్‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌ కమ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా వ్యవహరించాడు. ఫస్ట్‌‌‌‌ ఎడిషన్‌‌‌‌లో అండర్‌‌‌‌డాగ్‌‌‌‌గా దిగిన రాజస్తాన్‌‌‌‌ను విజేతగా నిలిపాడు. 2011 వరకు రాజస్థాన్‌‌‌‌కు కెప్టెన్ గా వ్యవహరించిన తర్వాత మెంటార్ గానూ ఆ టీమ్ కు సేవలందించాడు. ఆట నుంచి తప్పుకున్న తర్వాత వార్న్‌‌‌‌.. కామెంటేటర్‌‌‌‌గా సూపర్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అయ్యాడు. షార్ప్‌‌‌‌ గేమ్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. వార్న్‌‌‌‌ మృతిపై క్రికెట్‌‌‌‌ ప్రపంచం తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.
 

వార్న్ కెరీర్ హైలైట్స్

  • 1,001 వార్న్ అంతర్జాతీయ వికెట్ల సంఖ్య. మురళీధరన్ (1,347) ముందున్నాడు. 
  • 708 వార్న్ టెస్టు వికెట్లు. మురళీధరన్ (800) తర్వాత ఈ ఫార్మాట్లో ఎక్కువ వికెట్లు సాధించిన ఘనత వార్న్ దే. అయితే, మొట్టమొదట 600, 700 వికెట్ల మైలురాయిని చేరుకుంది మాత్రం వార్నే.
  • 37 టెస్టుల్లో వార్న్ సాధించిన 5 వికెట్ల ఘనత. మురళీధరన్ (67) ఫస్ట్​ప్లేస్​. 
  • 40,705 టెస్ట్ కెరీర్ లో వార్న్ వేసిన బంతులు. మురళీధరన్ (44,039), అనిల్ కుంబ్లే (40,850) తర్వాత వార్న్ మూడో ప్లేస్ లో ఉన్నాడు.
  • 1,761 టెస్టు కెరీర్ లో వార్న్ వేసిన మెయిడిన్ ఓవర్లు. మురళీధరన్ (1794) తర్వాత రెండో ప్లేస్ లో ఉన్నాడు.
  • 195  టెస్టుల్లో ఇంగ్లండ్ (యాషెస్​) పై వార్న్ సాధించిన వికెట్లు. ఓ అపోనెంట్ పై టెస్టు ఫార్మాట్ లో ఇప్పటివరకు ఏ బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు.
  • 96 2005 లో టెస్టుల్లో  వార్న్ సాధించిన వికెట్లు. ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ వార్న్.
  • 17  టెస్టుల్లో వార్న్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు. వసీం అక్రమ్ తో మూడో ప్లేస్ లో ఉన్నాడు. జాక్వెస్ కలిస్ (23), మురళీధరన్ (19) టాప్ లో ఉన్నారు.
  • 138 టెస్టుల్లో వార్న్ ఎల్బీడబ్ల్యూ వికెట్లు. కుంబ్లే (156), మురళీధరన్ (150) టాప్ లో ఉన్నారు.
  • 116  టెస్టుల్లో వార్న్ క్లీన్ బౌల్డ్ చేసిన సందర్భాలు. మురళీధరన్ (167), అండర్సన్ (124) టాప్ లో ఉన్నారు.