వన్డే ప్రపంచ కప్ లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్తాన్.. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకుగాను నికార్సైన కోచ్ కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ను.. కొత్త హెడ్‌కోచ్‌గా నియమించాలని పీసీబీ అధికారులు అతనితో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే వాట్సన్ పాక్ కోచ్ గా ఉందేందుకు ఆసక్తి చూపించడం లేదు. తాజాగా ఈ ఆసీస్ మాజీ ఆల్-రౌండర్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసు నుండి వైదొలిగాడు.
వాట్సన్ ప్రస్తుతం కోచ్, కామెంటరీగా పని చేస్తున్నాడు. ఇటీవలి PSL సీజన్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు కోచ్‌గా పనిచేసి మంచి విజయాలను అందించాడు. దీంతో పాక్ ఈ విదేశీ ఆటగాడిపై కన్నేసిన వాట్సన్ తన షెడ్యూల్ తో సరిపోతుందని పాక్ కోచ్ పదవిని వద్దనుకున్నాడు. ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో ప్రధాన కోచ్ గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో కామెంటేటర్ గా కొనసాగుతున్నాడు.
వాట్సన్ కోసం పాక్ క్రికెట్ బోర్డు ఎంత డబ్బు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది. నివేదికల ప్రకారం ఈ మాజీ ఆసీస్ ఆల్ రౌండర్ కోసం ఏకంగా ఏడాదికి పాకిస్థాన్ కరెన్సీలో 46 మిలియన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో చూసుకుంటే ఇది మొత్తం అక్షరాలా 55 కోట్ల రూపాయలను మాట. అంటే నెలకు 4.6 కోట్లు. ఇంత మొత్తంలో పీసీబీ డబ్బు ఆఫర్ చేయడం షాకింగ్ గా అనిపిస్తుంది. ఒకవేళ వాట్సన్ ఈ అంగీకారానికి ఒప్పుకుంటే పాక్ క్రికెట్ లో ఒక కోచ్ అందుకునే అత్యధిక శాలరీగా రికార్డ్ సృష్టించేవాడు.
#pcb #shanewatson #pakistancricket #headcoach pic.twitter.com/n6g0wwxJ5m
— 90's Cricket Lover (@90scricketlover) March 16, 2024