షాంఘైలో కరోనా కలకలం.. లాక్డౌన్ పెట్టినా తగ్గని కేసులు

బీజింగ్: చైనాలో కరోనా కలకలం రేపుతోంది. ఆ దేశంలోని పెద్ద నగరాల్లో ఒకటైన షాంఘైలో వైరస్ విజృంభిస్తోంది. లాక్ డౌన్ పెట్టినా అక్కడ కేసులు తగ్గడం లేదు. షాంఘైలో గడిచిన 24 గంటల్లోనే 20 వేల కొవిడ్ కేసులు నమోదవ్వడాన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే వైరస్ డెత్స్ కొత్తగా నమోదవ్వకపోవడం గమనార్హం. కరోనా వ్యాప్తి భయంతో సూపర్ మార్కెట్లను మూసేయడం, ఫుడ్ డెలివరీలపై నియంత్రణ విధించడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రెండు వారాల నుంచి లాక్ డౌన్ కొనసాగిస్తుండటంతో షాంఘై వాసులు ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో ప్రభుత్వం క్వారంటైన్ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈ క్రమంలో నేషనల్ కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్‌‌ను క్వారంటైన్ కేంద్రంగా మార్చింది. ఇందులో దాదాపు 40 వేల మంది వరకు క్వారంటైన్ లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసింది. 

మరిన్ని వార్తల కోసం:

పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ దురుసు ప్రవర్తన

దేశ యువతను కుటుంబ పార్టీలు ఎదగనిస్తలే

దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే