తమిళ అగ్ర దర్శకుడు శంకర్ (Shankar),తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియన్ 2 (Indian 2).1996లో వచ్చిన కమల్ హాసన్ భారతీయుడు (Bharateeyudu)సినిమాకు సీక్వెల్ గా శుక్రవారం (జూలై 12న) వరల్డ్ వైడ్ గా రిలీజై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ముందు నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.లంచగొండి తనాన్ని ఇక ఉపేక్షించేది లేదు అంటూ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రోజురోజుకు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో ఐదు రోజుల పాటు సినిమా ఆడిన తర్వాత మేకర్స్ మూవీ రన్‌టైమ్ ను తగ్గించడం గమనార్హం.
తాజాగా ఇండియన్ 2 మూవీ రన్‌టైమ్ ఏకంగా 12 నిమిషాలు తగ్గించినట్లు మేకర్స్ లైకా ప్రొడక్షన్స్ తన ట్విట్టర్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. "మీ మాట మేము విన్నాము..ఇప్పుడు ఇండియన్ 2 మూవీ 12 నిమిషాలు తగ్గింది..ట్రిమ్ చేసిన వెర్షన్ ను మీ దగ్గరిథియేటర్లలో చూసి ఆస్వాదించండి" అంటూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. నిజానికి ఇండియన్ 2 మూవీ ఏకంగా 3 గంటల 5 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి 12 నిమిషాలు కట్ చేసిన తర్వాత ఎలాంటి అనుభవాన్ని ఇవ్వనుందో తెలియాల్సి ఉంది.
ఏదేమైనప్పటికీ ఈ సినిమాపై వచ్చిన మిశ్రమ స్పందన ఆడియన్స్ లో బాగా పేరుకుపోయింది. నేటి సమాజ పరిస్థితులకు తగ్గట్టుగా కథ ఉన్న..స్క్రీన్ ప్లే శంకర్ స్థాయిలో లేకపోవడం పెద్ద మైనస్ గా నిలిచి కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక 12 నిమిషాలు కట్ చేసినప్పటికీ..అప్పటికీ సినిమా చూసిన ప్రేక్షకుడు మరలా చూసే అవకాశాలు లేదంటూ టాక్ వినిపిస్తోంది.
Witness the enhanced version of #Indian2 🇮🇳✂️ Now presenting a streamlined edition trimmed by 12 min. Catch it in cinemas near you for a crisper experience! 💥@IndianTheMovie 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh #Siddharth @actorsimha @anirudhofficial @dop_ravivarman… pic.twitter.com/0reMKOvMIe
— Lyca Productions (@LycaProductions) July 17, 2024