తమిళ అగ్ర దర్శకుడు శంకర్ (Shankar),తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియన్ 2 (Indian 2).1996లో వచ్చిన కమల్ హాసన్ భారతీయుడు (Bharateeyudu)సినిమాకు సీక్వెల్ గా శుక్రవారం (జూలై 12న) వరల్డ్ వైడ్ గా రిలీజై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.ముందు నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.లంచగొండి తనాన్ని ఇక ఉపేక్షించేది లేదు అంటూ వచ్చిన ఈ సినిమా కోసం భారతీయుడు ఫ్యాన్స్.
సినీ లవర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తు వచ్చారు.కానీ,భారతీయుడు సినిమా లెవల్లో,శంకర్ మార్క్ కథనం లేదంటూ పబ్లిక్ నుంచి కామెంట్స్ వచ్చాయి.ఇక అందుకు తగ్గట్టుగానే తొలిరోజు అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలా పడింది.ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా కేవలం రూ.26కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.అయితే,ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వరకు వసూలు చేస్తుందని మేకర్స్ తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశారు.కానీ,అందుకు పూర్తి భిన్నంగా కలెక్షన్స్ వచ్చాయి.
ఈ మూవీ తమిళంలో రూ.17 కోట్లు,తెలుగులో రూ.7.7కోట్లు మరియు హిందీ వెర్షన్లో కేవలం రూ.1.2కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం.అంతేకాదు,హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైందనే చెప్పుకోవాలి.ఇక వరల్డ్ వైడ్‌గా రూ.26కోట్ల కలెక్షన్లతో పాటు,ఉత్తర అమెరికాలో$1 మిలియన్‌ను వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.మరి ఈ వీకెండ్ లో ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
ఇకపోతే,లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కమల్ హాన్ విక్రమ్ ఫస్ట్ డే రూ.60 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక రీసెంట్ గా కమల్‌హసన్ విలన్‌గా నటించిన కల్కి 2898 AD మూవీ ఫస్ట్ డే ఏకంగా రూ.190 కోట్ల వసూళ్లను దక్కించుకుంది.
అలాగే 2018లో విడుదలైన కమల్ హాసన్ 'విశ్వరూపం 2'కూడా ఫస్ట్ పార్ట్ వలె బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.మొదటి భాగం 'విశ్వరూపం'ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రూ.20కోట్లు వసూలు చేయగా,సీక్వెల్ మాత్రం ఫస్ట్ డే రూ.7.7 కోట్లు వసూలు చేయగలిగింది.
అంతే కాకుండా శంకర్ లాస్ట్ మూవీ రోబో 2.ఓ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 93 మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.ఈ మూవీలో సగం వసూళ్లను కూడా ఇండియన్ 2కు రాబట్టలేకపోవడంలో బాక్సాఫీస్ వర్గాలను విస్మయపరుస్తోంది.