Bharateeyudu 2: క్లారిటీ ఇచ్చినట్టే ఇచ్చి కన్ఫ్యూజన్లో పెట్టారు.. ఇదేం ట్విస్ట్ శంకర్ సార్?

Bharateeyudu 2: క్లారిటీ ఇచ్చినట్టే ఇచ్చి కన్ఫ్యూజన్లో పెట్టారు.. ఇదేం ట్విస్ట్ శంకర్ సార్?

విక్రమ్(Vikram) అందించిన భారీ సక్సెస్ తో అప్పుడెప్పుడో ఆగిపోయిన భారతీయుడు 2(Bharateeyudu 2) సినిమాను మళ్ళీ మొదలుపెట్టారు లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన శంకర్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమా గురించి వినిస్తున్న చిన్న న్యూస్ క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ భారతీయుడు 2 అప్డేట్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. రిలీజ్ మంత్ ప్రకటించారు. భారతీయుడు 2 జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. దీంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, డేట్ ప్రకటించకుండా మళ్ళీ ట్విస్ట్ ఇచ్చాడు శంకర్. జూన్ లో రిలీజ్ అన్నారు కానీ, డేట్ మాత్రం ప్రకటించలేదు. అది చూసిన నెటిజన్స్ మళ్ళీ ఐడెమ్ ట్విస్ట్ శంకర్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక భారతీయుడు 2 సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్జె సూర్య, హీరో సిద్దార్థ్, సునీల్, బాబీ సింహ, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సామాజిక అంశమైనా లంచం కాన్సెప్ట్ తో రానుంది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.