గోదావరిఖని, వెలుగు : కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ యూనియన్ ఆర్జీ 2 ఏరియా వైస్ ప్రెసిడెంట్‌గా బదావత్శంకర్నాయక్ను నియమిస్తూ యూనియన్ సెక్రటరీ జనరల్, మినిమమ్ వేజ్అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జనక్‌ప్రసాద్ నియమించారు. సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా కొత్త సత్యనారాయణరెడ్డిని నియమించారు.
గోదావరిఖనిలోని యూనియన్ ఆఫీసులో గురువారం ఈ మేరకు నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్లు ఎస్.నర్సింహరెడ్డి, ధర్మపురి, ఎండీ అక్రమ్, వడ్డేపల్లి దాస్, వికాస్ కుమార్‌యాదవ్, కె.సదానందం, కృష్ణ, సంపత్ రెడ్డి పాల్గొన్నారు.