రంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. శంకర్ పల్లి ఎక్స్ రోడ్డు దగ్గర 64 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో భాగంగా ఒక మహిళతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.
రూ.16 లక్షల విలువైన గంజాయి, 2 సెల్ ఫోన్స్ సీజ్ చేశామని రాజేంద్రనగర్ SOT, చేవెళ్ల పోలీసులు తెలిపారు. ఒడిస్సా నుంచి గంజాయిని తెచ్చి హైదరాబాద్ లో ఈ ముఠా విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.