
ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా షణ్ముగం సాప్పని రూపొందించిన చిత్రం ‘షణ్ముఖ’. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 21న సినిమా రిలీజ్. ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ‘ఈ సినిమా టైటిల్‌లోనే ఎంతో ప్రత్యేకత ఉంది. హీరో ఆదితో పాటు టీమ్ అందరికీ ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా’ అని ఆల్ ద బెస్ట్ చెప్పారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. రవి బస్రూర్ సంగీతం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అందర్నీ థ్రిల్ చేసేలా చిత్రం ఉంటుంది’ అని అన్నాడు. ఇందులో నటించడం హ్యాపీగా ఉందని అవికాగోర్ చెప్పింది.
దర్శకుడు షణ్ముగం సాప్పని మాట్లాడుతూ ‘ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. మంచి టైటిల్‌కు తగ్గ కథతో ఈ సినిమా చేశా’ అని అన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.