వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ళ ఈ విండీస్ పేసర్ 2012 అరంగేట్రం చేసి తన 12 ఏళ్ళ అంతర్జాతీయ క్రికెట్ కు ముగింపు పలికాడు. అద్భుతమైన పేస్ తో బౌన్స్ రాబట్టగల ఈ విండీస్ వీరుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తాను రిటైర్మెంట్ అవుతున్న నిర్ణయాన్ని వెల్లడించాడు. 2023 లో భారత్ పై సొంతగడ్డపై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. సంవత్సరకాలంగా పేలవ ఫామ్ తో విండీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు.
షామార్ జోసెఫ్, జయదేవ్ సీల్స్ లాంటి యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తుండడంతో గాబ్రియేల్ కు జట్టులో స్థానం కష్టమైంది. "గత 12 సంవత్సరాలు ఎంతో అంకిత భావంతో వెస్టిండీస్ క్రికెట్ జట్టు తరపున ఆడినందుకు చాలా గర్వంగా ఉంది. నాకు ఇష్టమైన ఆటను దేశం తరపున ఆడడం ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోషంతోనే నా కెరీర్ ను ముగిస్తున్నాను". అని గాబ్రియేల్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరమైనా ట్రినిడాడ్ అండ్ టొబాగో కోసం దేశీయ క్రికెట్‌ను ఆడతానని స్పష్టం చేశాడు.
Also Read :- 40 ఏండ్ల తర్వాత కాశ్మీర్‌లో క్రికెట్
వెస్టిండీస్ తరపున 59 టెస్టులు, 25 వన్డేలు ఆడిన గాబ్రియేల్ రెండు ఫార్మాట్ లలో కలిపి 202 వికెట్లు పడగొట్టాడు. 2018 లో శ్రీలంక తరపున టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో 13 వికెట్లు తీసుకొని తన కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. వెస్టిండీస్ చరిత్రలో ఇది నాల్గవ అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలు. 2017లో హెడ్డింగ్లీలో ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్ లో విండీస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Shannon Gabriel announces international retirement after 12 years for West Indies 🌴
— ESPNcricinfo (@ESPNcricinfo) August 28, 2024
READ MORE: https://t.co/X92D9WEc3r pic.twitter.com/nE9TDnTwp3