ప్రముఖ వ్యాపార దిగ్గజం, మానవతావాది రతన్ టాటా మరణంతో దేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విలువలు, మర్యాదలనేవి లేకుండా ధనార్జనే లక్ష్యంగా సాగుతోన్న ఈ రోజుల్లో.. తన వేల కోట్ల సంపాదనలో సగానికి పైగా డబ్బును తృణప్రాయంగా పేదలకు కోసం ఖర్చు చేస్తోన్న గొప్ప మానవతావాది మరణంపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దేశంలో ఎందరో బిలియనీర్లు ఉన్న.. తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న రతన్ టాటా నిష్క్రమణతో భారత వ్యాపారం రంగంలో ఈ లోటు పూడ్చలేనిదంటూ దేశం కన్నీరు పెడుతోంది. రతన్ మరణంతో యావత్ దేశం ఆయనను స్మరించకుంటోంది. ఈ క్రమంలో రతన్ టాటా చివరి రోజుల్లో ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన శంతను నాయుడు టాటా మరణంపై ఎమోషనల్ పోస్ట్ చేశారు.
‘‘మీ మరణంతో మన స్నేహితంలో శూన్యం మిగిలింది.. మీరు లేని ఈ లోటును పూడ్చటానికి జీవితాంతం ప్రయత్నిస్తాను. మీ ప్రేమ దూరమవడంతో కలుగుతోన్న దుఃఖం చెప్పలేనిది.. గుడ్‌బై మై డియర్ లైట్ హౌస్’’ అంటూ శంతను నాయుడు భావోద్వేగ పోస్ట్ చేశాడు. కాగా, బిజినెస్ టైకూన్ టాటాతో అత్యంత సన్నిహితంగా మెలగడం ద్వారా శంతను నాయుడు ప్రపంచానికి పరిచయమయ్యారు. కాగా, 28 ఏళ్ల శంతను నాయుడు టాటా ఫ్యామిలీకి చెందిన ఐదో తరం. ప్రస్తుతం టాటా గ్రూప్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. శునకాలపై ఉండే అమితమైన ప్రేమ శంతను నాయుడు, రతన్ టాటా మధ్య స్నేహానికి దారి తీసింది. టాటా చివరి రోజుల్లో ఎక్కువగా శంతనుతోనే టైమ్ స్పెండ్ చేశారు. టాటా వృద్ధాప్య దశలో ఆయనకు దగ్గరుండి శంతను సేవలు చేశారు. ఈ క్రమంలోనే టాటా మరణంతో శంతను ఎమోషనల్ అయ్యాడు.
ALSO READ : రతన్ టాటాకు భారత రత్న! : మహారాష్ట్ర కాబినేట్ ప్రతిపాదన