వరప్రసాద్ రెడ్డికి తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం.. వచ్చే నెల 2న సీఎం చేతుల మీదుగా ప్రదానం

హైదరాబాద్, వెలుగు: శాంతాబయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. ఏటా సాహిత్యం, లలిత కళలు, సాంస్కృతిక రంగాలకు సేవలందించిన ప్రముఖులకు వర్సిటీ విశిష్ట పురస్కారాన్ని అందజేస్తోంది.

ఈ ఏడాది వరప్రసాద్ రెడ్డికి ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్టు తెలుగు వర్సిటీ ఇన్ చార్జ్ రిజిస్ర్టార్ రెడ్డి శ్యామల తెలిపారు. వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 2న బాచుపల్లి ప్రాంగణలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని అందించనున్నట్టు చెప్పారు.