
- మహారాష్ట్ర సర్కార్ కు శరద్ పవార్ హెచ్చరిక
పుణె: కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి షిండే సర్కారు చేస్తున్న ప్రయత్నాలు సరిపోవట్లేదని, రైతులను ఆదుకునే విషయంలో నిర్లక్ష్యం కూడదని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు.
క్షేత్ర స్థాయిలో అవసరమైన మరిన్ని చర్యలు చేపట్టకుంటే తాను పోరాటానికి దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈమేరకు సోమవారం సీఎం ఏక్నాథ్ షిండేకు ఆయన లేఖ రాశారు. డ్యామ్లలో నీటి మట్టాలు పడిపోయాయని, రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొందని తెలిపారు. సహాయక చర్యలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైదని ఆందోళన వ్యక్తంచేశారు.