ఇకపై పోటీ చేయకపోవచ్చు.. రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌పై శరద్‌‌‌‌ పవార్ కీలక వ్యాఖ్యలు

ఇకపై పోటీ చేయకపోవచ్చు.. రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌పై శరద్‌‌‌‌ పవార్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రముఖ రాజకీయవేత్త, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ (83) తన పొలిటికల్​రిటైర్మెంట్‌‌‌‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని పేర్కొన్నారు. పవార్.. 1999లో ఎన్సీపీని స్థాపించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో 'గ్రాండ్ ఓల్డ్ మ్యాన్'గా పేరు తెచ్చుకున్నారు. బారామతిలో ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి, తన మనుమడు యుగేంద్ర పవార్ తరఫున మంగళవారం పవార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

అక్కడ యుగేంద్ర పవార్​పెదనాన్న అజిత్​పవార్​పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ.. ‘‘నేను ప్రస్తుతం అధికారంలో లేను.. రాజ్యసభలో నా పదవీకాలం ఇంకా ఏడాదిన్నర ఉంది. ఆ తర్వాత నేను భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను. ఎవరైనా ఎక్కడో ఒకచోట ఆగిపోవాల్సిందే కదా. ఓవరాల్‎గా 14 సార్లు తనను ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు బారామతి ఓటర్లకు కృతజ్ఞతలు” అని పవార్​ పేర్కొన్నారు.