జన్నారం, వెలుగు: బంజారా సేవా సంఘం అధ్వర్యంలో జన్నారం మండల కేంద్రం నుంచి శరణ సేవాలాల్ పాదయాత్ర చేపట్టారు. సేవాలాల్ మహారాజ్‌కు ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు పాల్గొని నృత్యాలు చేశారు. ఈ పాదయాత్ర ఆసిఫాబాద్ జిల్లా కొత్తపల్లి వరకు కొనసాగుతుందని సేవా సంఘం నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జి భూక్య జాన్సన్ నాయక్, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు రితీశ్ రాథోడ్, మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, పొనకల్ మాజీ సర్పంచ్ జక్కు భూమేశ్, బంజారా సేవ సంఘం నాయకులు పాల్గొన్నారు.