టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌కు శరత్‌‌‌‌ కమల్‌‌‌‌ వీడ్కోలు

టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌కు శరత్‌‌‌‌ కమల్‌‌‌‌ వీడ్కోలు

చెన్నై: ఇండియా టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ లెజెండ్‌‌‌‌‌‌‌‌ ఆచంట శరత్‌‌‌‌‌‌‌‌ కమల్‌‌‌‌‌‌‌‌ ఈ నెల చివర్లో ఆటకు వీడ్కోలు పలకనున్నాడు. ఈ మేరకు బుధవారం తన రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌పై స్పష్టత ఇచ్చాడు. ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే వరల్డ్‌‌‌‌‌‌‌‌ టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ టోర్నీయే తనకు చివరిదని చెప్పాడు. 22 ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌లో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన శరత్‌‌‌‌‌‌‌‌.. కామన్వెల్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఏడు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. 

సియా క్రీడల్లో రెండు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ఐదుసార్లు ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగాడు. పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా పతాకాధారిగా వ్యవహరించడం అతని కెరీర్‌‌‌‌‌‌‌‌కే హైలెట్‌‌‌‌‌‌‌‌. ‘టీటీ నాకు చాలా ఇచ్చింది. నా మాటల్లో దీన్ని వర్ణించలేను. రాబోయే రోజుల్లో కొత్త తరం మరింత సత్తా చాటాలని కోరుకుంటున్నా’ అని శరత్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు.