
భారత క్రికెట్ జట్టులో స్థానం లేదు. ఐపీఎల్ లోనూ ఎవరూ పట్టించుకోవడం లేదు. గాయాల సమస్యలు.. ఫామ్ లేకపోవడం.. రిటైర్మెంట్ ఆలోచనలు. నెల క్రితం వరకు టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పరిస్థితి ఇది. అయితే రంజీ ట్రోఫీలో అతను అసాధారణ ఫామ్ చూపిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్ము లేపుతున్నాడు. జమ్మూ కాశ్మీర్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన శార్దూల్.. తాజాగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో హ్యాట్రిక్ తో సత్తా చాటాడు.
గురువారం (జనవరి 28) మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో చివరి బంతులకు వికెట్లను తీసుకున్నాడు. బాలచందర్ అనిరుధ్,సుమిత్ కుమార్,జస్కీరత్ సింగ్ వికెట్లను తీసుకొని మేఘాలయను కష్టాల్లో పడేశాడు. ఈ ముగ్గరు కూడా డకౌట్లు కావడం విశేషం. శార్దూల్ అద్భుత ప్రదర్శనతో అతనికి ఇంగ్లాండ్ లో జరగబోయే సిరీస్ లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ లాంటి పిచ్ లపై ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు ఎంతో కీలకం. గతంలోనూ ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన అనుభవం ఈ ముంబై ఆటగాడికి ఉంది.
ALSO READ : Virat Kohli: నెక్స్ట్ లెవల్లో కోహ్లీ క్రేజ్.. అభిమానులతో నిండిపోయిన అరుణ్ జైట్లీ స్టేడియం
ఈ మ్యాచ్ విషయానికి వస్తే శార్దూల్ తో పాటు మిగిలిన పేసర్లు రాణించడంతో ప్రస్తుతం మేఘాలయ 7 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ఒక దశలో రెండు పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోత్ కష్టాల్లో పడిన ఆ జట్టును ప్రింగ్సాంగ్ సంగ్మా(18*),ఆకాష్ చౌదరి(16) ఆదుకున్నారు. తొలి మ్యాచ్ లో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, జైశ్వాల్, శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్ ఆడడం లేదు.
రంజీ ట్రోఫీలో ముంబై బౌలర్ల హ్యాట్రిక్ జాబితా:
1) జహంగీర్ బెహ్రంజీ ఖోట్ (బాంబే) vs బరోడా - 1943/44
2) ఉమేష్ నారాయణ్ కులకర్ణి (బాంబే) vs గుజరాత్ - 1963/64
3) అబ్దుల్ మూసబోయ్ ఇస్మాయిల్ (బాంబే) vs సౌరాష్ట్ర - 1973/74
4) రాయిస్టన్ హెరాల్డ్ డయాస్ (ముంబై) vs బీహార్ - 2023/24
5) శార్దూల్ ఠాకూర్ (ముంబై) vs మేఘాలయ- 2024-25
🚨 HAT-TRICK FOR SHARDUL THAKUR IN RANJI TROPHY 🚨
— Johns. (@CricCrazyJohns) January 30, 2025
- Thakur making a strong case for England tour in June. pic.twitter.com/Q2dcki5ayF