IND vs AUS: బౌలింగ్ చేస్తూ అస్వస్థతకి గురైన శార్దూల్ ఠాకూర్.. ఏమైందంటే..?

IND vs AUS: బౌలింగ్ చేస్తూ అస్వస్థతకి గురైన శార్దూల్ ఠాకూర్.. ఏమైందంటే..?

టీమిండియా బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ అస్వస్థతకు గురయ్యాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో భాగంగా 15వ ఓవర్ సమయంలో తొలి నాలుగు బంతులేసిన తర్వాత శార్దూల్ కొద్దిగా అసౌకర్యంగా కనిపించాడు. దీంతో ఆట కాసేపు ఆగిపోయింది. అయితే, డ్రింక్స్ విరామం తర్వాత అతను తన ఓవర్ పూర్తి చేశాడు. ఇక ఈ ఓవర్ వేసిన తర్వాత శార్దూల్ మరో ఓవర్ వేయకపోవడంతో ఇప్పుడు ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ మొదలయింది. తొలి నాలుగు ఓవర్లలో 33 పరుగులు సమర్పించుకొని బౌలింగ్ లో విఫలమయ్యాడు. మరి శార్దూల్ తిరిగి బౌలింగ్ వేస్తాడో లేదో చూడాలి. 

Also Read : IND vs AUS 1st ODI: ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు..? భారత్ వ్యూహాలేంటి..?

ఆచితూచి ఆడుతున్న ఆసీస్.. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ ప్రస్తుతం 30 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసింది.తొలి ఓవర్లోనే మార్ష్ వికెట్ తీసి షమీ శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన స్మిత్ వార్నర్ తో కలిసి భారత బౌలర్లపై ఎదరు దాడికి దిగారు. ఈ ఇద్దరు 94 పరుగులు జోడించిన తర్వాత జడేజా టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.
 
అర్ధ సెంచరీ చేసిన  వార్నర్ ని (52) పెవిలియన్ కి చేర్చాడు. ఆ తర్వాత స్మిత్ 41 పరుగులు చేసిన స్మిత్ ని షమీ ఒక అద్భుతమైన బంతితో బౌల్డ్ చేసాడు. ప్రస్తుతం క్రీజ్ లో లబుషేన్(39), గ్రీన్(13) ఉన్నారు.