SRH vs CSK: స్టార్ బౌలర్ వస్తున్నాడు: క్లాసన్‌కు చెక్ పెట్టేందుకు చెన్నై మాస్టర్ ప్లాన్

SRH vs CSK: స్టార్ బౌలర్ వస్తున్నాడు: క్లాసన్‌కు చెక్ పెట్టేందుకు చెన్నై మాస్టర్ ప్లాన్

ఐపీఎల్ లో నేడు(ఏప్రిల్ 5) ఆసక్తి సమరం జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్ లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో కేవలం ఒకటే గెలవడంతో సొంతగడ్డపై ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలని భావిస్తుంది. ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు టాప్ ఫామ్ లో ఉన్న హెన్రిచ్ క్లాసన్ మీదే ఉన్నాయి. అయితే ఈ సఫారీ ఆటగాడిని ఔట్ చేసేందుకు చెన్నై స్టార్ బౌలర్ ను రంగంలోకి దించుతున్నట్టు సమాచారం.

లార్డ్ ఠాకూర్ ఆగమనం..!

చెన్నై ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ కు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం రాలేదు. అయితే ముస్తాఫిజుర్ రెహమాన్ స్వదేశానికి వెళ్లిపోవడంతో ఈ పేసర్ నేడు జరిగే మ్యాచ్ లో ఆడటం దాదాపుగా ఖాయమైంది. పైగా శార్ధూల్ కు క్లాసన్ పై మంచి రికార్డ్ ఉంది. ఐపీఎల్ లో 11 బంతుల్లో 2 సార్లు ఈ సఫారీ వీరుడిని ఔట్ చేశాడు. స్లో బాల్స్, నకుల్ బంతులు వేయడం ఠాకూర్ కు వెన్నతో పెట్టిన విద్య. అదే సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయితే చెన్నై ప్లాన్ వర్కౌట్ అయినట్టే. పతిరానా, దీపక్ చాహర్, జడేజాలతో కూడిన బౌలింగ్ లైనప్ మనోళ్లకు పెద్ద సవాలుగా మారింది.

ఇరు జట్ల ముఖాముఖి పోరులో ఇప్పటివరకు చెన్నై స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. చెన్నై 14 మ్యాచ్ ల్లో గెలిస్తే.. సన్ రైజర్స్ కేవలం 5 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. రెండు జట్లు సమంగానే కనిపిస్తున్నా సొంతగడ్డపై ఆడుతుండడంతో ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు  వేదిక ఏదైనా చెన్నైలాంటి జట్టును ఓడించాలంటే అది శక్తికి మించిన పని. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచి తమ ఖాతాలో కీలకమైన రెండు పాయింట్లను వేసుకుంటారో చూడాలి.