
న్యూఢిల్లీ: మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన శార్దూల్ ఠాకూర్‌కు మళ్లీ ఐపీఎల్ ఆడే చాన్స్ దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ మోషిన్ ఖాన్ గాయంతో మెగా లీగ్‌కు దూరం కావడంతో అతని ప్లేస్‌లో శార్దూల్‌ను తీసుకున్నారు. ఈ మేరకు ఫ్రాంచైజీ ఆదివారం వెల్లడించింది. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో జట్టు సోమవారం జరిగే తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
‘శార్దూల్‌కు ఐపీఎల్‌లో మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంది. మోషిన్ ప్లేస్‌లో అతన్ని తీసుకుంటున్నాం. రిజిస్టర్ పూల్‌లో ఉన్న బేస్ ప్రైస్ రూ. 2 కోట్లకే తీసుకున్నాం. ఐదు ఫ్రాంచైజీల తరఫున 95 మ్యాచ్‌లు ఆడాడు’ అని ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం విశాఖలో ఉన్న లక్నో జట్టుతో శార్దూల్ చేరాడు. పాదం సర్జరీ తర్వాత రంజీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన శార్దూల్ 505 రన్స్‌తో పాటు 35 వికెట్లు పడగొట్టాడు.