
బెంగళూరు:ప్రపంచమంతటా స్టార్టప్‌ల కల్చర్ పెరుగుతోంది. ఇండియాలోనూ ఇవి విపరీతంగా ఉన్నాయి. వెంచర్‌క్యాపిటల్, ప్రైవేట్ఈక్విటీ సంస్థలు స్టార్టప్‌లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి కాబట్టి పెద్ద కంపెనీల పని అయిపోతుందని, వాటి వ్యాపారం నడవదనే వాదనలు వినిపించాయి. ఇవన్నీ నిజం కాదని ఇండియా టాప్–3 కార్పొరేట్ గ్రూప్‌లు రిలయన్స్, టాటా, అదానీ నిరూపించాయి. ఇవి తమ వ్యాపారాలను విస్తరించడానికి, కొత్తవి మొదలుపెట్టడానికి, కొత్త రంగాల్లో అడుగుపెట్టడానికి భారీగా ఖర్చు చేస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో వ్యాపారాలను పెద్ద ఎత్తున విస్తరించడానికి కనీసం 215 బిలియన్ డాలర్లు (రూ.17.63 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నాయి. మూడు గ్రూపుల ఎదుగుదల స్టాక్మార్కెట్లపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతానికి, ఐదు టాటా కంపెనీలు (టీసీఎస్, టైటాన్, టాటా కన్స్యూమర్, టాటా స్టీల్ టాటా మోటార్స్), రెండు అదానీ సంస్థలు (అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్) రిలయన్స్ ఇండస్ట్రీస్షేర్లు ఎన్ఎస్ఈ నిఫ్టీ–50లో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రూపులు వ్యాపారాలు పెద్దవిగా మారాయి. కొన్ని విడిపోగా, మరికొన్ని మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఈ ఏడాది రిలయన్స్సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఆర్థిక సేవల వ్యాపారాన్ని మొదటగా మార్కెట్లో లిస్ట్ చేస్తామని ఈ ఏడాది అక్టోబరులో ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. రిలయన్స్ గ్రూపు దాని టెలికాం లేదా రిటైల్ వ్యాపారాలను విడదీసి లిస్ట్ చేస్తుందని అనుకున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ బ్యాంకింగ్ ఎక్స్పర్టు కామత్‌కు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పగ్గాలను అప్పగించారు. దీని లిస్టింగ్‌కు తేదీని నిర్ణయించలేదు. ఈ కంపెనీ క్లీన్ ఎనర్జీపైనా ఫోకస్చేస్తోంది. బ్యాటరీలు, హైడ్రోజన్, సౌర శక్తి ప్రాజెక్టులలోకి ప్రవేశించింది. ఈ కొత్త వెంచర్ కోసం 75 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.
బిజీబిజీగా టాటా బాస్
టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఈ ఏడాది అంతా బిజీబిజీగా గడిపారు. నష్టాలతో కునారిల్లుతున్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ ఈ ఏడాదే దక్కించుకుంది. తన మరో ఎయిర్‌లైన్ విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేసే పనిని ప్రారంభించింది. ఏడు లిస్టెడ్ స్టీల్ వ్యాపారాలను టాటా స్టీల్‌తో విలీనం చేసింది. టాటా కూడా అన్ని కంపెనీల విస్తరణ కోసం రాబోయే ఐదేళ్లలో 90 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. రెన్యువబుల్ ఎనర్జీ బిజినెస్ కోసం రాబోయే ఐదు సంవత్సరాల్లో టాటా పవర్ 10 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయబోతోంది. గిగా ఫ్యాక్టరీలను నిర్మించడానికి 5 బిలియన్ డాలర్లు కేటాయించింది.
అదానీ గ్రూపు కొత్త వ్యాపారాలు
ఈ సంవత్సరం అదానీ గ్రూపు వ్యాపారాలను భారీగా విస్తరించింది. అదానీ విల్మార్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. అంబుజా సిమెంట్స్, ఏసీసీని 10.5 బిలియన్ డాలర్లకు కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్‌ను తయారు చేసేందుకు 50 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఆగస్టులో 5జీ బ్యాండ్‌విడ్త్‌ను దక్కించుకొని టెలికం రంగంలో కూడా అడుగుపెట్టారు. ఎన్డీటీవీలో దాదాపు 65శాతం వాటాను దక్కించుకోవాలని చూస్తున్నారు. గౌతమ్ అదానీకి చెందిన పది కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి.
రిలయన్స్బాస్గా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అంబానీ
తన తండ్రి ధీరూబాయ్ అంబానీ మరణం కారణంగా రిలయన్స్పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు ముకేశ్ అంబానీ బుధవారంతో 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో కంపెనీ మార్కెట్ క్యాప్ఏటా 20.6 శాతం (యాన్యువలైజ్డ్రేట్) పెరిగింది. రెవెన్యూ 17 రెట్లు పెరిగింది. లాభాలు 20 రెట్లు పెరిగాయి. గ్లోబల్ కంపెనీగానూ రిలయన్స్ ఎదిగింది.