మోకిల పీజీ హిల్స్​లో ఉత్సాహంగా శారీథాన్

మోకిల పీజీ హిల్స్​లో ఉత్సాహంగా శారీథాన్

హైదరాబాద్, వెలుగు: మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన, సుస్థిరత, కమ్యూనిటీ స్పిరిట్ పెంచడమే లక్ష్యంగా మంగళవారం మోకిల పీజీ హిల్స్​లో నిర్వహించిన శారీథాన్ సందడిగా సాగింది. గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు చీర కట్టులో మెరిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 5కె, 3కె రన్ ను టీడీఎఫ్ కు చెందిన శారద నేరెళ్ల, గీతా భాస్కర్, భవాని, కృష్ణ ప్రియ, విశాల ప్రారంభించారు. 

అనంతరం మహిళా పారిశ్రామిక వేత్తలు​తమ ప్రొడక్టులను ప్రదర్శించారు. ఇండ్లల్లో ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించాలని, ఎకో ఫ్రెండ్లీ వస్తువులనే ఉపయోగించాలని గండిపేట వెల్ఫేర్ సొసైటీ మెంబర్ వాణి తిమ్మయ్యగారి మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. అనంతరం వేస్ట్​ మేనేజ్​మెంట్ నిర్వహణతో పొల్యూషన్​ను తగ్గించేందుకు కృషి చేస్తున్న మోకిల సంఘాలను అభినందించారు. పారిశుద్ధ్య కార్మికులకు గ్రీన్​ అవార్డులు, చక్కని చీరకట్టులో పాల్గొన్న మహిళలకు అవార్డులు ఇచ్చారు.