గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం –2 డివిజన్ పరిధిలోని వకీల్‌పల్లిమైన్‌లో వెల్డింగ్ చేస్తూ ఈ నెల 21న చనిపోయిన కాంట్రాక్టర్ కార్మికుడి శర్మ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలంటూ కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాలు పట్టుబట్టడం, సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో డెడ్‌బాడీని మార్చురీలోనే ఉంచి ఆందోళనకు దిగారు.
ఆదివారం మధ్యాహ్నం మరోసారి చర్చలు జరిపి రూ. 15 లక్షలతో పాటు, మృతుడి ఫ్యామిలీలో ఇద్దరికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. ఇందులో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నుంచి రూ. 6 లక్షలు, సింగరేణి మేనేజ్‌మెంట్ నుంచి రూ. 5 లక్షలు, సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున రూ.2 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2 లక్షలు ఇచ్చేలా ఒప్పుకోవడంతో పోస్ట్‌మార్టంకు అంగీకరించారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శర్మ మృతదేహాన్ని స్వగ్రామమైన సుందిళ్లకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు