చిత్తశుద్ధి ఉంటే  ఆ భూముల్లో ఇండ్లు కట్టాలె

చిత్తశుద్ధి ఉంటే  ఆ భూముల్లో ఇండ్లు కట్టాలె

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సేకరించిన భూములను కేసీఆర్ అమ్ముకుంటున్నారని షర్మిల  ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే ఈ భూముల్లో ఎంతోమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వొచ్చని ఆమె ట్వీట్ చేశారు. దొరకు అమ్ముకోవడం మీద ఉన్న శ్రద్ధ.. ఇండ్లు కట్టించడంలో లేదని దుయ్యబట్టారు. 

‘మధ్యతరగతి ప్రజలు మోసపోవద్దని, రియల్ ఎస్టేట్ ధరల నుంచి రక్షణ కల్పించాలని, పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలని వైఎస్ రాజశేఖర రెడ్డి ఇండ్ల నిర్మాణం కోసం భూములను సేకరించి 2007లో రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రవేశపెట్టారు. నేడు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాల్సిన ఆ భూములను కేసీఆర్ అమ్ముకొని కోట్లు కూడగట్టుకుంటున్నాడు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ భూముల్లో ఎంతో మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇవ్వొచ్చు. కానీ దొరకు అమ్ముకోవడం మీద ఉన్న శ్రద్ధ.. ఇండ్లు కట్టించడంలో లేదు’ అని షర్మిల చెప్పారు. 

మరిన్ని  వార్తల కోసం:

ఓయూలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల బందోబస్తు

ఇప్పుడంతా ఓటీటీల మాయ..

పుష్ప డైలాగ్‎తో అదరగొట్టిన ‘ది గ్రేట్ కాళీ’