2024 ఎన్నికల నేపథ్యంలో ఏపీలో నామినేషన్ల పర్వం మొదలైన వేళ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అభ్యర్థుల తమ ఆస్తుల విలువ, తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు అఫిడవిట్లో వెల్లడిస్తుండటంతో వాటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అఫిడవిట్లో జగన్, భారతి వద్ద 82కోట్లకు పైగా ఉన్నట్లు వెల్లడించటం హాట్ టాపిక్ గా మారింది. వైరల్ గా మారిన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది షర్మిల.
జగన్ తనకు ఇచ్చిన మాట వాస్తవమే అని, ఆ విషయాన్ని తాను అఫిడవిట్లో కూడా పేర్కొన్నట్లు క్లారిటీ ఇచ్చారు షర్మిల. ఈ క్రమంలో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఆడబిడ్డకు ఆస్తిలో వాటా తీసుకునే హక్కు ఉంటుందని, వాటా ఇవ్వాల్సిన బాధ్యత అన్నదమ్ములకు ఉంటుందని. ఆస్తిగా రావాల్సిన వాటాను ఇచ్చినట్లే ఇస్తూ ఎదో గిఫ్ట్ గా, అప్పుగా ఇచ్చినట్లు చూపిస్తుంటారని అన్నారు. చెల్లెళ్లకు ఇవ్వాల్సిన వాటాను తమ వాటాగా బావిస్తుంటారని, ఒక్క కొసరు చెల్లెళ్లకు గిఫ్ట్ గా ఇచ్చి, అది కూడా అప్పుగా ఇచ్చినట్లు చూపిస్తుంటారని అన్నారు.