సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కుంభకర్ణుడని, ఆరు నెలల ముందు నిద్ర లేచాడని అన్నారు. వివేకాను హత్య చేసినవారు యథేచ్ఛగా తిరుగుతున్నారని, ఆధారాలున్నప్పటికీ చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడికి జగన్ టికెట్ ఇచ్చారని, హత్య చేసినవాడినే గెలిపించాలని అనుకుంటున్నాడని అన్నారు.
వివేకాను హత్య చేసినవారా, వైఎస్సార్ బిడ్డనా తేల్చుకోవాలని, తండ్రిలాగే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు షర్మిల. కమలాపురం ఎమ్మెల్యే, మేనమామ రవీంద్రారెడ్డిపై కేసుల షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ నుండి వచ్చానని తనపై కామెంట్ చేస్తున్నారని, అక్కడ కేసీఆర్ ను ఓడించానని, ఏపీలో కొంచెం పని ఉండి వచ్చానని అన్నారు.