కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్, అవినాష్ రెడ్డిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ చిన్న పిల్లోడని అనటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సాక్ష్యాలు చెరిపేస్తుంటే చూస్తూ ఉరుకున్నాడని అన్నారు. హంతకుడికి టికెట్ ఎందుకిచ్చారని మండిపడ్డారు. వివేకా హత్య వెనుక అవినాష్ హస్తం ఉందని పూర్తి ఆధారాలున్నాయని, అవినాష్ ను జగన్ వెనకేసుకొని వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేకా హత్య జరిగితే సఖిలో హార్ట్ అటాక్ గా నడిపింది జగన్ మోహన్ రెడ్డి భార్యనే కదా అని ప్రశ్నించారు. పులి కడుపునా పులే పుడుతుందని, ఎంపీగా తనను గెలిపించాలని కోరారు షర్మిల.కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, రాజశేఖర రెడ్డి తమ్ముడిని హత్య చేసిన హంతకుడు కావాలో నిర్ణయించుకోండని అన్నారు షర్మిల. మరి, మునుపెన్నడు లేని విధంగా కడప బరిలో నెలకొన్న త్రిముఖ పోరులో విజయం ఎవరు సాధిస్తారో చూడాలి.