ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ పాలనకు, జగన్ పాలనకు పోలికే లేదని అన్నారు. వైఎస్ ఎప్పుడూ ప్రజల్లోనే ఉండేవారని, జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలతో ఎన్నడూ మమేకం కాలేదని అన్నారు. జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్మెంట్ దొరకటం లేదని, ఇక సామాన్యులకు జగన్ అందుబాటులోనే లేరని మండిపడ్డారు. మధ్య నిషేధమని చెప్పి ప్రభుత్వమే మద్యం మ్ముతోందని, ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్స్ ఇక్కడే ఉన్నాయని అన్నారు.
జగన్ సర్కార్ నాసిరకం మద్యం అమ్ముతోందని, అది తాగి ప్రజలు చనిపోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు షర్మిల. జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల డే1 నుండి వివేకా హత్య కేసు విషయంలో జగన్ పై ప్రత్యక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు షర్మిల కడప ఎంపీగా బరిలో దిగిన నేపథ్యంలో జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరి, ఎన్నడూ లేని విధంగా కడపలో నెలకొన్న త్రిముఖ పోరులో ఎవరు నెగ్గుతారో వేచి చూడాలి.