ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకు మద్దతివ్వాలా.. జగన్ పై షర్మిల ఫైర్ 

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ మద్దతివ్వకపోవటంపై జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు షర్మిల. కాంగ్రెస్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్.. తన ధర్నాకు ఎందుకు సంగీభావం ఎందుకు తెలపాలో చెప్పాలని అన్నారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకు మద్దతివ్వాలా అని ప్రశ్నించారు. వ్యక్తిగత హత్యకు రాజకీయరంగు పులిమినందుకు మద్దతివ్వాలా అని ప్రశ్నించారు షర్మిల.

ఐదేళ్లపాటు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని, మణిపూర్ ఘటనపై నోరెత్తని జగన్ కు ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావటం విడ్డూరమని మండిపడ్డారు.  వైఎస్సార్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా.. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి సంఘీభావం వచ్చిందా అని ప్రశ్నించారు.

ALSO READ | చంద్రబాబు సూపర్ 6 డకౌట్ అయ్యింది.. మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు..

మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా...రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని అన్నారు.
సిద్దం అన్న వాళ్లకు 11మంది భలం సరిపోలేదా, ఇప్పుడు కలిసి పోరాడదామంటున్నారని సెటైర్ వేశారు షర్మిల. జగన్ పై షర్మిల చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.