ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టారు షర్మిల. రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టే తాను ఏపీలో అడుగు పెట్టానని అన్నారు. పదవుల కోసం రాజకీయాలు చేసేదాన్ని అయితే 2019లోనే పదవులు పొంది ఉండేదాన్నని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు కాబట్టే విడిపోయి పదేళ్లయినా వెనుకబడి ఉందని అన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో జగన్, చంద్రబాబులకు చిత్తశుద్ధి లేదని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ అన్యాయం చేస్తోందని అన్నారు.
ALSO READ :- మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు... హాల్ టికెట్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి...
ఆంధప్రదేశ్ కి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. రాష్ట్రానికి హోదా సాధించలేని వాడు రాజశేఖర రెడ్డి వారసుడు ఎలా అవుతాడంటా జగన్ పై మండి పడ్డారు షర్మిల. షర్మిల కంటతడి పెట్టిన సమయంలో బీజేపీ, వైసీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. షర్మిల కంటతడి పెట్టిన వీడియో వైరల్ అవుతోంది.