జగన్ ను పైసా సహాయం కూడా అడగలేదు.. కంటతడి పెట్టిన షర్మిల...

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కంటతడి పెట్టారు. కడప డీసీసీ ఆఫీసులో డీసీసీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు షర్మిల.ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షర్మిలను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కంటతడి పెట్టారు షర్మిల. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాకు రాజకీయ కాంక్ష లేదని అన్నారు. పదవులు ఇవ్వలేదనే షర్మిల తనతో విభేదించిందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు షర్మిల.

జగన్ కోసం పాదయాత్ర చేసిన తనపై ఈ రోజు నిందలు మోపుతున్నారని అన్నారు షర్మిల. ఒకే ఫ్యామిలీకి చెందిన ఒకే తరం వారు రాజకీయాల్లో ఉండటం సరికాదన్న జగన్ తన భార్య బంధువు, తనకు తమ్ముడైన అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తాను కానీ, తన భర్త అనీల్ కానీ, ఏనాడు జగన్ ను ఒక్క పైసా సహాయం కూడా అడగలేదని, జగన్ నుండి ఎలాంటి సహాయం పొందలేదని అన్నారు. తండ్రి పేరును చార్జిషీట్లో చేర్చిన వారిని వెంటపెట్టుకున్న మీకు, సాక్షిలో తండ్రి ఫోటో పెట్టుకొని, ఆయన తమ్ముడు వివేకా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కధనాలు ప్రసారం చేసిన మీరు విశ్వనీయత గురించి ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.