రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదు

తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. TRS పార్టీ అకౌంట్ లో రూ. 860 కోట్లు ఉంటే.. ఆ పార్టీ నేతల అకౌంట్లో ఇంకా ఎంత డబ్బు ఉంటుందోనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడం సీఎం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటున్నారు.. అవే వస్తే నిరుద్యోగ సమస్య ఎందుకు తీరడం లేదని ప్రశ్నించారు. ఆంధ్ర సంస్థలను మూసి వేస్తామని కేసీఆర్ అన్నారనే కాంటెస్ట్ లో వైఎస్సార్ వీసా అనే పదం వాడారని తెలిపారు. కేసీఆర్ ఇతర రాష్ట్రంలో రైతులకు పరిహారం ఇవ్వడం అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. డబ్బులు ఉన్న వారికే రాజ్యసభ పదవులు ఇచ్చారని షర్మిల విమర్శించారు.

అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా ? లేదా ?  అని ప్రజలకు అనుమానం వస్తోందన్నారు. ఇక పాదయాత్రపై కూడా ఆమె మాట్లాడారు. నడిచింది తానే అయినా.. నడిపించింది మాత్రం ప్రజలన్నారు. తాను చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోందన్నారు. షర్మిలను ఆదరిస్తున్నారంటే.. అది వైఎస్సారే కారణమని, ఆయన్ను ప్రజలు మరిచిపోలేదని తెలిపారు. ప్రజల కోసమే తాము పాదయాత్ర చేయడం జరుగుతోందని తెలిపారు షర్మిల. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రజా ప్రస్థానం పాదయాత్రను నిర్వహిస్తోంది. ధాన్యం కొనుగోళ్ల అధ్యయనం కోసం ఈ నెల 11న పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం మే 28వ తేదీ నుంచి పాదయాత్ర పున:ప్రారంభించారు. 

మరిన్ని వార్తల కోసం : 
రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన

ప్రధాని రాకతో రాష్ట్రంలో కాషాయ శకం ప్రారంభమైంది