ఆదిలాబాద్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర రేపు జగిత్యాల జిల్లాలో ప్రవేశించనుంది. జగిత్యాల జిల్లాలో రెండు రోజుల పాటు షర్మిల యాత్ర కొనసాగుతుందని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ కు షర్మిల యాత్ర చేరుకుంటుంది.
అనంతరం మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్, సంగెం, రామ్ రాజ్ పల్లె, దామరాజ్ పల్లి, మల్లాపూర్, కుస్థాపూర్, సిరిపూర్, రాఘవపేట్ గ్రామాలలో షర్మిల పాదయాత్ర సాగనుంది. ఈ నెల 29న మల్లాపూర్ మండలంలోని హుస్సేన్ నాగర్, ముత్యంపేట్ గ్రామం వరకు పాదయాత్ర చేసి.. షుగర్ ఫ్యాక్టరీ వద్ద వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలోధర్నా, సభ నిర్వహించనున్నారు.