తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని.. ఎందుకుండకూడదని ఆమె అన్నారు. ఆమె ఈరోజు లోటస్‌పాండ్‌లో వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనానికి వైఎస్ఆర్ అభిమానులు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభిమానులకు చెప్పకుండా పార్టీ పెట్టను. అన్ని జిల్లాల నాయకులతో మాట్లాడుతా. పార్టీ పెట్టాలా? వద్దా? అనే విషయంపై కూడా చర్చిస్తా. త్వరలోనే అన్ని విషయాలు ప్రకటిస్తా. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నాను. మొదట నల్గొండ జిల్లా నాయకులతో మాట్లాడుతున్నాను. ఆ తర్వాత అన్ని జిల్లాల నేతలను కలుస్తా. వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో ఉంది’ అని ఆమె అన్నారు. కాగా.. విశ్వసనీయ సమాచారం మేరకు షర్మిల జూన్‌లో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

For More News..

ఏడు నెలల్లో ఏడుసార్లు అమ్మకానికి గురైన 18 ఏళ్ల యువతి

ఎర్రకోటపై దాడికి కారణమైన దీప్ సిద్దు అరెస్ట్

తెలంగాణ నేతలతో షర్మిల భేటీ.. లోటస్ పాండ్‌లో హడావుడి..