ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు.షర్మిల కడప ఎంపీగా ఎన్నికల బరిలో దిగుతారని చాలా కాలంగా వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం షర్మిల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. - కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని, నేను అయినా ఇతర ముఖ్య నాయకులు అయినా ఆదేశాలు పాటించాలని, అధిష్టానం ఆదేశిస్తే ఎవరైనా పోటీకి సిద్ధపడాలని అన్నారు. రాష్ట్రంలో సమస్యలపై సమాధానం చెప్పాలని సజ్జలకు కౌంటర్ ఇచ్చారు.
మా కలలు పక్కన పెట్టి, మీరు ఏ కళలు కంటున్నారో చూడండంటూ పరోక్షంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వమని, కడప ఎంపీగా ఉండి కూడా కడప స్టీల్ ప్లాంట్ పై ఎందుకు పోరాటం చేయలేదని ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు.అయితే, ఈ భేటీ తర్వాత షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేసే అంశం మీద క్లారిటీ ఇస్తారని ఎదురు చుసిన పార్టీ శ్రేణులకు మాత్రం నిరాశే మిగిలిందని చెప్పాలి.
ALSO READ :- Sreemukhi: స్టేజిపైనే హీరో చెంప పగులగొట్టిన శ్రీముఖి.. వైరల్ అవుతున్న వీడియో